| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
రాజమహేంద్ర! కవీంద్రస | మాజ సురక్ష్మాజ! రాజమార్తాండ! ధరి త్రీజననుతచారిత్ర! వి | రాజిత గుణరత్న! రాజరాజనరేంద్రా! |
236 |
| వసంతతిలకము |
వీరావతార! సుకవిస్తుత! నిత్యధర్మ ప్రారంభ! శిష్టపరిపాలనసక్త! రాజా! నారాయణాఖ్య! కరుణారసపూర్ణ! వీర శ్రీరమ్య! రాజకులశేఖర! విష్ణుమూర్తీ! |
237 |
| గద్య. | ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున నాగగరుడోత్పత్తియు, సముద్రమథనంబును, నమృతసంభవంబును, సౌపర్ణాఖ్యానంబును, జనమేజయ సర్పయాగంబును, నాస్తీక చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము. | 238 |