| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
ఎఱుక గలవారి చరితలు | గఱచుచు, సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం బెఱుఁగుచు, నెఱిఁగిన దానిని | మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్. |
203 |
| క. |
ఇచ్చునది పాత్రునకు ధన | మచ్చుగ; నొరు వేఁడకుండునది; యభిముఖు లై వచ్చిన యాశార్థుల వృథ | పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్. |
204 |
| క. |
మనమునకుఁ బ్రియంబును హిత | మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం బును బరిమితమును నగు పలు | కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్. |
205 |
| సీ. |
వదన బాణాసన వ్యక్తముక్తము లైన | పలుకు ల న్కడువాఁడి బాణతతులఁ బరమర్మలక్ష్యముల్ పాయక భేదించు | చుండెడి దుర్జనయోధవరుల కడనుండ కున్నది; కరుణ యార్జవమక్ష | జయము సత్యంబును శమము శౌచ మను నివి యెద నిల్పునది; శత్రుషడ్వర్గ | జయమందునది శుద్ధశాంతబుద్ధి; |
|
| తే. |
మదముఁ గామముఁ గ్రోధంబు మత్సరంబు | లోభమును మోహమును నను లోని సహజ వైరివర్గంబు నొడిచినవాఁడ యొడుచు | నశ్రమంబున వెలుపలి యహితతతుల. |
206 |
| వ. | ‘అని పూరుం గఱపితి; నమ్మహాపురుషుం డొరులకుఁ గఱపునట్టి సర్వగుణసంపన్నుం’ డనిన విని యింద్రుండు వెండియు నయ్యయాతి కి ట్లనియె. | 207 |
| క. |
ఏమి తపం బొనరించితి | భూమీశ్వర! పుణ్యలోక భోగంబులఁ దే జోమహిమ ననుభవించితి | సామాన్యమె శతసహస్రసంవత్సరముల్. |
208 |
| వ. | అనిన నయ్యింద్రున కయ్యయాతి యి ట్లనియె. | 209 |
| క. |
సురదైత్య యక్షరాక్షస | నరఖేచర సిద్ధమునిగణ ప్రవరుల భా సురతపములు నాదగు దు | ష్కరఘోరతపంబు సరియుఁ గా వమరేంద్రా!. |
210 |