| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అనిన విని దుష్యంతుండు దానినంతయు నెఱింగియు నెఱుంగనివాఁడ పోలె ని ట్లనియె. | 76 |
| క. |
ఏ నెఱుఁగ నిన్ను; నెక్కడి | దానవు? మిన్నకయ యనుచితంబులు పలుకం గా నేల? యరుగు మంబురు | హానన! యెందుండి వచ్చి తందులకు వడిన్. |
77 |
| వ. | అనిన విని, వెల్లనై, వెచ్చనూర్చి, నిశ్చేష్టిత యై, కెందమ్మిరేకులవలనం దొరంగు జలకణంబులపోలెఁ గోపారుణిత నయనంబుల బాష్పకణంబులు దొరంగం దలవాంచి, యారాజుం గటాక్షించుచు, హృదయసంతాపంబు దనకుం దాన యుపశమించుకొని, పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కి ట్లనియె. | 78 |