| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
వీరుఁడు పాండుమహీపతి | దారుణ బాణ త్రయమునఁ దద్వ్యాఘ్రంబున్ ధారుణిఁ ద్రెళ్ళఁగ నడుమన | భూరిభుజుం డేసి కాచెఁ బుత్త్రుం దేవిన్. |
113 |
| క. |
ఉరు శార్దూల భయంబునఁ | బరవశ యయి కుంతి యున్న బాలకుఁడు శిలో త్కరముపయిఁ బడియెఁ దన ని | ష్ఠురతనుహతిఁ జేసి రాలు చూర్ణంబులుగన్. |
114 |
| వ. | దానిం జూచి పాండురాజు సంభ్రమంబునఁ బఱతెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు మ్రొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి, గాంధారీధృతరాష్ట్రులకుఁ బుత్త్రశతంబు పుట్టుట విని, ఋషులవలన దివ్యమంత్రోపదేశంబుఁ గొని. | 115 |