| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| ఉ. |
బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ ర్త్యాధము లైన సౌబలదినాధిపసూనులయొద్ద నప్దు దు ర్యోధనుఁ డాదిగాఁగ సుతు లున్న సభన్ విని దుఃఖితాత్ముఁ డై యా ధృతరాష్ట్రుఁ డా వఱచిన ట్లఱచెన్ వివిధప్రలాపుఁ డై. |
169 |
| వ. | మఱియు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃపురంబున నెగసె; భీష్మాదికురువృద్ధులును విప్రులుం బౌరులును శోకాక్రాంతు లయిరి; విదురుండు పాండవులకుశలస్థితి యెఱింగియు నెఱుంగనియ ట్లందఱం గలసి దుఃఖితుండపోలె నుండె; నంత ధృతరాష్ట్రుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల కుదకదానంబు సేసి సంస్కారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల నపారధనంబులతోడం బుచ్చిన. | 170 |
| క. |
మతిఁ బాండుకుమారుల పం | చత విని దుర్యోధనుండు సంతసపడియెన్; హితుఁ డయిన పురోచను పం | చత కెంతయు జాతదుఃఖచంచలుఁ డయ్యెన్. |
171 |