| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | అని తానును భీమసేనుండును గడఁగి రిపుబలంబుపయి నపరిమితశరంబు లేసె; భీమసేనుండు నొక్క వృక్షంబు వెఱికికొని దండ హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె; నంత న య్యిద్దఱ మహా సంరంభంబుఁ జూచి విస్మితుఁ డై కృష్ణుండు బలదేవుని కి ట్లనియె. | 194 |
| సీ. |
‘తాలాభ మగు విల్లు దాల్చి విరోధుల | నెగచుచున్నవాఁ డింద్రతనయుఁ; డాతని కెలన మహావృక్షహస్తుఁడై | యున్న వీరుండు వృకోదరుండు; యంత్రంబు నరుఁ డేసి నప్పుడు పోయిన | యగ్గౌరవర్ణుండు యమతనూజుఁ; డాతనితోడన యరిగిన యిరువురుఁ | గవల వా రర్కప్రకాశ తేజు’ |
|
| ఆ. |
లనిన ‘లక్కయింట నగ్నిదాహంబున | నెట్లు బ్రదికి రొక్కొ! యిమ్మహాత్ము; లెట్టి పుణ్యదినమొ యేవురఁ జూచితి’ | మనుచు సంతసిల్లె హలధరుండు. |
195 |
| వ. | అంత. | 196 |
| క. |
కురుపతి సూడఁగఁ గర్ణుఁడు | నరుఁ దాఁకెను; శల్యుఁ డనిల నందనుఁ దాఁకెన్ సరభసమున, విస్మయ మం | దిరి ధరణీదేవమనుజదేవప్రవరుల్. |
197 |
| శా. |
కర్ణుండున్ విజయుండు నొండొరులఁ జుల్కం దాఁకి; చాపంబు లా కర్ణాంతం బగుచుండఁగాఁ దిగిచి యుగ్రక్రోధులై యేసి; రా పూర్ణంబయ్యెఁ దదీయ బాణతతి నంభోభృత్పథం బెల్ల; నా స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల; నవిసెన్ దిక్చక్ర మెల్లన్ వడిన్. |
198 |
| క. |
వీరుఁడగు నరుని యేయు న | పార శరావలుల నడుమ వారింపంగా నేరక యే టుడిగి మహా | శూరుఁడు రాధేయుఁ డింద్రజున కి ట్లనియెన్. |
199 |
| క. |
నా యెదురఁ జక్కనై యని | సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం తేయుఁ డగు విజయునకుఁ గా | కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్. |
200 |
| క. |
నీ వప్రాకృతబలుఁడవు; | నీ విక్రమమునకు విల్లునేర్పునకు మహీ దేవకులోత్తమ! మెచ్చితి; | నావుడుఁ బార్థుండు గర్ణునకు ని ట్లనియెన్. |
201 |
| మధ్యాక్కర |
ఏను నీ చెప్పిన వారిలోపల నెవ్వఁడఁ గాను; గాని నే సర్వశస్త్రాస్త్రవిద్యలఁ గడుఁ బ్రసిద్ధుండ; భూనుత బ్రహ్మతేజో-ధికుఁడ; నిన్నుఁ బోరిలో నోర్వఁ గా నున్న వీరుండ; నొండు దక్కి లోఁగక చక్క నిలుము. |
202 |
| వ. | అనిన విని కర్ణుండు బ్రహ్మతేజం బజేయం బని విజయుతోడియుద్ధం బొల్లక క్రమ్మఱియె; మఱిశల్య భీమసేనులు పెనంగి మల్లయుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుం ద్రెళ్ళ వైచిన. | 203 |
| ఆ. |
సెల్లుఁ డట్లు నేల ద్రెళ్ళి చెచ్చెర లేచి | యొడలు దుడిచికొనుచు నొయ్యఁ జనియె; వానిఁ జూచి నగుచు మానుగా విప్రులు | భూరిసత్త్వు భీముఁ బొగడి రంత. |
204 |
| ఆ. |
పరశురాముఁ డొండె హరుఁ డొండె నరుఁ డొండె | గాక యొరులు గలరె కర్ణు నోర్వ! బలిమి భీముఁ డొండె బలదేవుఁ డొండెఁ గా| కొరులు నరులు శల్యు నోర్వఁ గలరె! |
205 |
| వ. | ‘వీ రెవ్వరో యెం దుండుదురో యెఱుంగవలయు’ నని దుర్యోధనాదు లయిన రాజపుత్త్రు లెల్ల విస్మితు లయి యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె. | 206 |
| చ. |
పరులకు దుష్కరంబయిన భాసుర కార్యము సేసి, తత్స్వయం వరమునఁ బత్నిఁగాఁ బడసె వారిరుహాయత నేత్రఁ గృష్ణ నీ ధరణిసురాన్వయోత్తముఁడు ధర్మవిధిం; జెపుఁడయ్య యింక నె వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింపఁగన్. |
207 |
| వ. | ‘వలవ దుడుగుం, డని వారించిన; నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్త్రులు దమతమదేశంబులకుం జని; రంత భీమార్జునులు బ్రాహ్మణపరివృతు లయి ద్రుపదరాజపుత్త్రిం దోడ్కొని వచ్చునంత. | 208 |
| సీ. |
‘ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి | కడుఁ బెద్ద ప్రొ ద్దయ్యెఁ; గొడుకు లేల మసలిరొ? కౌరవుల్ విసువక వైరంబు | గావించు పాపస్వభావు; లెఱిఁగి క్రందునఁ జంపిరో? యందుల కేవురు | లీలతో నొక్కట నేల యరిగి? రవ్యయుం డయిన వేదవ్యాసువచనంబు | నిక్కంబుగాకుండు నొక్కొ? వేల్పు |
|
| ఆ. |
లార! భూసురేశులార! మీ శరణంబ | కాని యొండుగతియుఁ గాన; నాకు శరణ మగుఁడు; సుతులఁ గరుణతో రక్షింపుఁ’ | డనుచుఁ గుంతి వగచి వనరుచుండె. |
209 |