| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| తరలము |
ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో దివిజవంద్యుఁడు ప్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్. |
90 |
| మానిని |
తమ్ములుఁ దానును ధర్మతనూజుఁడు తత్‌క్షణసంభృతసంభ్రముఁ డై యమ్మునినాథవరేణ్యునకున్ వినయమ్మున మ్రొక్కి సమున్నతపీ ఠమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడఁ జేసి మునీశ్వర నె య్యమ్మున నీ విట వచ్చుటఁజేసి కృతార్థుల మైతిమి యిందఱమున్. |
91 |
| వ. | ‘మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె’ నని పరమప్రీతిహృదయులై పలికి, పరమభక్తిం బాంచాలి మ్రొక్కించి యున్నంత, నందఱ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి, వా రేవురకు నేకాంతంబున ని ట్లనియె. | 92 |
| సీ. |
సర్వధర్మజ్ఞుల రుర్వీశపూజ్యుల | రన్యోన్యనిత్యసౌహార్దయుతుల రగణితగుణయుక్తిఁ బొగడంగఁ దగువార | లిట్టి మీ కేవుర కిపుడు ద్రుపద సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై | నది; యీక్రమంబు లోకాగమంబు లందు విరుద్ధ; మీసుందరికారణం | బున మీకు విప్రీతి పుట్టకుండ |
|
| ఆ. |
నుండవలయుఁ; బ్రియసహోదరుల్ దొల్లి సుం | దోపసుందు లొక్కయువతి కడరి విగ్రహించి యసురవీరులు దమలోనఁ | బొడిచి మృత్యునిలయమునకుఁ జనిరి. |
93 |
| క. |
అనిన నది యెట్టు లని యమ | తనయుఁడు గడువేడ్కతోడఁ ద న్నడిగిన నా తనికిఁ దదీయానుజులకు | నినసన్నిభుఁ డమ్మునీంద్రుఁ డి ట్లని చెప్పెన్. |
94 |