| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| సీ. |
బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవు | లాదిగా బెరసిన యాదవాగ్ర గణ్యులుఁ దాను నగణ్యమహావస్తు | వాహనంబులు గొని వాసుదేవుఁ డనుజకు నరణ మీ నర్థితోఁ జనుదెంచె; | హరిరాక యెఱిఁగి ధర్మాత్మజుండు గరము గారవమునఁ గవలను గృష్ణున | కెదురు పుత్తెంచిన నింద్రలీల |
|
| ఆ. |
నిందువంశవిభుఁ డుపేంద్రుఁ డింద్రప్రస్థ | పురము సొచ్చె నతివిభూతి మెఱసి యనుజవరులతోడ నంతఁ బ్రత్యుద్గతుం | డై యుధిష్ఠిరుండు హర్ష మెసఁగ. |
215 |
| వ. | వసుదేవాది యాదవవృద్ధుల కెల్ల మ్రొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్నాదుల నుచితప్రియ పూర్వకంబున సత్కృతులం జేసిన. | 216 |
| ఉ. |
ఆనకదుందుభిప్రభృతియాదవులుం గురుముఖ్యులున్ మృదం గానకదుందుభుల్ సెలఁగ నత్యనురాగముతో నిరంతర శ్రీనుతు లొప్ప నుత్సవము సేసిరి సప్తదినంబు లిష్టస మ్మానములన్ మహీసురసమాజసమీహితపూజనంబులన్. |
217 |
| వ. | అంత. | 218 |
| క. |
నిరుపమపరార్థ్యరుచి సుం | దరరత్నావళుల శోభితము లగువానిన్ వరదుఁడు సహస్రసంఖ్యా | భరణంబులఁ బార్థునకు సుభద్రకు నిచ్చెన్. |
219 |
| వ. | మఱియును. | 220 |
| సీ. |
అవిరళక్షరితదానార్ద్రగండస్థల | గజసహస్రంబును, గనకరత్న రచిత మై తురగసారథిసహితం బైన | రథసహస్రంబును, రమ్యభూష ణాలంకృతస్త్రీసహస్రంబుఁ, గాంచన | శిబికాసహస్రంబుఁ, జిత్రలలిత గతి నొప్పు నేనూఱుగాడిదలను, సింధు | బాహ్లికకాంభోజపారసీక |
|
| ఆ. |
జాత మైన తురగశతసహస్రము, లక్ష | గోధనంబు, నధికఘోరవీర దర్పయుక్తు లైన దశలక్షదాశార్హ | వరుల నరణ మిచ్చె వామనుండు. |
221 |
| క. |
క్రమమునను గొంతిదేవిని | యమనందను భీముఁ గవల నాద్రౌపది ను త్తమరత్నాభరణాదుల | నమరఁగ వేర్వేఱ నెయ్యుఁ డయి పూజించెన్. |
222 |
| వ. | మఱియు బలదేవాదియాదవముఖ్యు లెల్ల సుభద్రార్జునులం బూజించి, పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం జని; రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత. | 223 |