| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
కలికాలభరతలక్ష్మీ | లలనాస్పద! వీర గుణ విలాస! విరోధి ప్రళయాంతక! నిఖిలమహీ | వలయోద్వహబాహు! విష్ణువర్ధనమూర్తీ! |
355 |
| పృథ్వీవృత్తము |
సమస్త భువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా! సమీహితగుణ క్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా! నమ న్నృప కిరీట చుంబి చరణద్వయా! సంతత క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా! |
356 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబున బృహదశ్వు దర్శనంబును, నలోపాఖ్యానంబును, నారదాగమనంబును, సకలతీర్థకీర్తనంబును, రోమశుం డర్జున కుశలవార్తఁ జెప్పుటయు, రోమశమహాముని యుపదేశంబున ధర్మజు తీర్థాభిగమనంబును, నగస్త్యుండు లోపాముద్రం బరిగ్రహించుటయు వాతాపిభక్షణంబును నన్నది ద్వితీయాశ్వాసము. | 357 |