| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
రాజకులతిలక! భువన వి | రాజిత సితకీర్తి! దివిజరాజవిభవ! ని ర్వ్యాజ పరాక్రమ! సకల ధ | రాజన సంపూజ్య! ధర్మరక్షణ దక్షా! |
436 |
| స్రగ్విణి. |
సర్వలోకాశ్రయా! సౌమ్యభావోదయా! నిర్వికారాకృతీ! నిత్యసత్యోన్నతీ! గర్వితోద్యద్భుజాకల్ప! కల్పోల్లస త్సర్వసర్వంసహాచక్ర! చక్రాయుధా! |
437 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుత నన్నయ్యభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునఁ బతివ్రతా చరిత్రంబును, ధర్మవ్యాధుండు గౌశికునకుఁ బరమధర్మం బెఱింగించుటయు, నగ్నివంశానుకీర్తనంబును, గుమారోత్పత్తియు, సత్యాద్రౌపదీ సంవాదంబును, బాండవులు ద్వైతవనంబునకుం జనుటయు, ధృతరాష్ట్ర వాక్యంబులును, దుర్యోధనాదుల దుర్మంత్రంబున ఘోషయాత్రయుఁ, గౌరవ గంధర్వ యుద్ధంబును, దుర్యోధనాదులు గంధర్వులచేతం బట్టువడుటయు, నర్జునుండు వారల విడిపించుటయు నన్నది పంచమా శ్వాసము. | 438 |