| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
విమలక్షాత్ర గుణోన్నత! | విమలాదిత్యాత్మజన్మ! విలసత్కమలా రమణీ కరకమలోజ్జ్వల | విమలాంబుజరేణు రాగ విలసిత వక్షా! |
410 |
| వనమయూరము |
భూసురకదంబ సురభూరుహ! వికాసో ద్భాసిత కృపారసవిపాక! సుగుణైకో ల్లాస! హరహార మృగలాంఛన మృణాళీ హాసినవకీర్తి విసరాకలితలోకా! |
411 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్యపర్వంబునందు దుర్యోధను ప్రాయోపవేశంబును, బాతాళగతు లయిన దానవు లతని నాశ్వాసించుటయు, వైష్ణవయాగ ప్రవర్తనంబును, బాండవులు గ్రమ్మఱఁ గామ్యకవనంబున కరుగుటయు, వ్రీహిద్రోణాఖ్యానంబును, ద్రౌపదీహరణంబును; జయద్రథు భంగంబును, రామాయణ కథా ప్రవృత్తియు, నందు రామరావణుల జననంబును, రాఘవవనప్రస్థానంబును, సీతాపహరణంబును, సుగ్రీవమిత్రత్వంబును, వాలివధయును, ద్రిజటాస్వప్నకథనంబును, రావణ దుష్టవచనంబులు నన్నది షష్ఠాశ్వాసము. | 412 |