పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
సమరానివర్తనంబు వలని ఫలము (సం. 12-100-1)
క. జనకుఁడు ప్రతర్దనునకుం | దనకును రణమైన యపుడు తన యోధులకున్‌
విను నాకంబును నరకముఁ | గనుఁగొనుఁ డని చూపి చెప్పెఁ గౌరవముఖ్యా!
444
తే. పుణ్యతమము భోగాస్పదంబును మనోహ | రాంగనా జనబహులంబు నైనయది ర
ణంబు బిరుదులై చేసిన నరుల నెలవు; | దూరఁ బందలచో టిది దుఃఖమయము.
445
వ. అని తన మాహాత్మ్య ంబునం జూపనోపిన యుభయ స్థలంబులుం జూపం జూచి, యేచి యవ్వీరులు దెంపు వొంపిరి వోవం దఱియ నుఱికి వైరుల జయించిరి; సమరంబు తెగువ దీప్తలక్ష్మి ం గరంబొనర్చుఁ బుణ్యతమ లోకంబు లిచ్చుం గావున శూరుం డధిక పుణ్యోదారుం డని యిట్లు దేవవ్రతుండు ధర్మశూరునకు సమరానివర్తన జనవిశేషం బెఱింగించె నని చెప్పిన విని ‘యట మీఁద వారల సంప్రశ్నోత్తరంబులు ప్రవర్తిల్లిన విధంబులు వినిపింపు’ మనుటయు. 446
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )