| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
పరమమునీంద్ర సంయమనపక్వ వివేకవిభూతి రమ్య! వి స్తర మహనీయ తార్కిక వచః కలనా నభిగమ్య! దేవతా సుర పరిరక్షణోన్మథన శోభి కటాక్ష విహార! నిత్య సుం దర! శుభకాంతిపూర! దురితప్రవిదారణ! వీతకారణా! |
455 |
| క. |
ఆదిత్యమరుద్వసు రు | ద్రాది సకలదేవతా మయాత్మక! శ్రీ సం పాదనవిధావిచక్షణ | పాద సరోజా! మహర్ధిభక్తసమాజా! |
456 |
| మాలిని |
అమల హృదయవేద్యా! హవ్యకవ్య ప్రసాద్యా! శమసుఖమయమూర్తీ! సర్వలోక ప్రవర్తీ! కమలభవ నిషేవ్యా! కామదూరానుభావ్యా! యమనియమవికాసీ! వ్యాసచేతో నివాసీ! |
457 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతంబున శాంతిపర్వంబునందుఁ జతుర్థాశ్వాసము. | 458 |
| శాంతిపర్వంలోని నాలుగవ ఆశ్వాసం సమాప్తం. | ||