| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| చ. |
అమర కిరీట కోటి కలితారుణ రత్నమరీచి వీచికా సముదయ ఖేలనోల్లసన చారు పదాంబుజ కాంతిపూర! దు ర్దమ దను సూను సంచయ విదారణచిత్త విహార! బోధనా గమ హితనాద నిర్వహణ కౌతుక విశ్రుత! రక్షితాశ్రితా! |
432 |
| క. |
జనవినుత! బాదరాయణ | మునీంద్ర వాగమృతనిధి సముద్భూతాహ్లా దన కీర్తి సుధాకిరణా! | వినతాఖిలభద్రకరణ! విశ్రుత చరణా! |
433 |
| మాలిని |
అమృతమయ విలాసా! యాగభాస్వద్విలాసా! విమల హృదయరమ్యా! వీతరాగాది గమ్యా! కమలభవ నమస్యా! గౌరవాధిక్య శస్యా! శమదమ పరివర్తీ! శాశ్వతానందమూర్తీ! |
434 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీమదాంధ్ర మహాభారతంబున ద్రోణపర్వంబునందు సర్వంబును బంచమాశ్వాసము. | 435 |
| శ్రీమదాంధ్రమహాభారతంలోని ద్రోణపర్వం ముగిసింది. | ||