| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
నీరజమిత్త్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి స్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా నారదుఁ డేఁగుదెంచె గగనంబుననుండి సురేంద్రమందిర స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్. |
23 |
| క. |
తన పిఱుఁద ధర్మ సంబో | ధన వాంఛను వచ్చు దేవతా ఖచర మహా మునివరులఁ దపనమార్గం | బునఁ గ్రమ్మఱఁ బంచె బ్రహ్మపుత్త్రుఁడు నెమ్మిన్. |
24 |
| వ. | పర్వతపారిజాతరైవత సుముఖు లను మహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్గతుండయి ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించిన, వారల కుశలం బడిగి నారదుఁడు రాజనీతి విషయంబుల నయ్యుధిష్ఠిరు ని ట్లని యడిగె. | 25 |