| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
విరహితసత్త్వుఁ డయ్యెఁ బ్రతివీరుఁడు; వీని నశేష ధారుణీ శ్వరనికరాపరాధు నతిసాహసికున్ వధియించి, నీ భుజ స్థిరత యెలర్ప నయ్యనిలదేవుబలంబును నీ బలంబు భా సురముగ మాకుఁ జూపుము విశుద్ధయశోనిధి! మారుతాత్మజా! |
208 |
| వ. | అని ప్రబోధించిన ననిలతనయుం డనిలదేవుం దలంచి తత్ప్రసాదంబున నధికసత్త్వసమేతుండై. | 209 |
| ఉ. |
ఆతనిఁ బట్టి యెత్తి నిహతాహితవీరుఁడు వానిముక్కునన్ వాతను గర్ణరంధ్రముల వారక శోణితధార లొల్కఁగా వాతసుతుండు వీచె శతవారము లుద్ధత చండ వాత సం ఘాత వివర్తమాన తృణఖండసముం డగుచుండ మాగధున్. |
210 |
| వ. | మఱియును. | 211 |
| క. |
వెఱచఱవఁ బట్టికొని వడిఁ | జఱచి జరాసంధుసంధిసంధుల యెమ్ముల్ విఱిచి వధియించి యార్చెను | వఱలఁగ భీముండు భువనవలయం బద్రువన్. |
212 |
| చ. |
అవనితలంబు వ్రస్సెనొ, హిమాచలశృంగము వ్రయ్యలయ్యెనో, శ్రవణ విదారణం బయిన శబ్దము దా నిది యేమి యొక్కొ భై రవమయి విన్చె నంచును బురంబునవారు భయంబు వొంది; రం దువిదలగర్భముల్ గలఁగె; నుక్కడఁగెన్ మగధేశు సైన్యముల్. |
213 |
| వ. | ఇట్లు భీమసేనుండు జరాసంధుఁ జంపి వాని వధియించుట జగద్విదితంబుగాఁ దదీయ గృహద్వార తోరణ సమీపంబునం దత్కళేబరంబు వైచిన నది సర్వజన భయంకరంబయి యుండె; నంత నాదిత్యోదయంబున. | 214 |