| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | నారాయణుండును ధర్మరాజు వీడ్కొని తద్దివ్యరథారూఢుండయి ద్వారవతీపురంబున కరిగె, నంత నిక్కడ. | 224 |
| చ. |
భరతకులైక భూషణుఁడు భాసురతేజుఁడు ధర్మనందనుం డురు భుజ విక్రమంబున జయోన్నతిఁ బోల్పఁగ వీరు లోకపా లురయని భీముఁ బార్థు నకులున్ సహదేవునిఁ బంచెఁ దూర్పు ను త్తరమును బశ్చిమంబు మఱి దక్షిణమున్ వరుసన్ జయింపఁగన్. |
225 |
| వ. | ఇట్లు పంచిన నలువురు నపార చతురంగ బలసమేతులై నాలుగు సముద్రంబులపై నడచు నపూర్వ సముద్రంబులుం బోలె నాలుగు దిక్కులపై నడచి రనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 226 |
| క. |
నరసుతు లయ్యై దిక్కుల | కరిగి మహీపతులచేత నరిగొని ధనముల్ దెరలఁగఁ దెచ్చిన మార్గముఁ | బరువడి నెఱిఁగింపు నాకుఁ బరమమునీంద్రా! |
227 |
| వ. | అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. | 228 |