| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
భూరి గుణ రత్న భూషణ! | నారాయణమూర్తి! రాజనారాయణ! కం ఠీరవ విక్రమ! శారద | నీరద నీహార హీర నిభశుభకీర్తీ! |
295 |
| అంబురుహ వృత్తము. |
రాజకులోత్తమ! రాజమనోహర! రాజసూరి సభాంతర భ్రాజిత సద్గుణ పార్థివశేఖర! పార్థ సన్నిభ! బాంధవాం భోజవనద్యుమణీ! మణికాంచన పుంజ భూషిత! భూమరు ద్రాజసమాజ! పరాక్రమరాఘవ! రాజరాజనరేశ్వరా! |
296 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్ట ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబునందు సభాపర్వంబున ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలుర సభాశ్రవణంబును, రాజసూయ మహాధ్వరారంభంబును, జరాసంధవధయు, గిరివ్రజ నిరుద్ధులయిన రాజులం గృష్ణుండు విడిపించుటయు, దిగ్విజయంబును, రాజసూయంబు నన్నది ప్రథమాశ్వాసము. | 297 |