| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము |
| క. |
‘నా యనుజులు దుఃఖార్దితు | లై యున్నా; రట్టు లగుట నచటికి రా; నిం కీ యెడన నేను నిలిచెదఁ | బాయక యని చెప్పు మా కృపానిరతునకున్.’ |
028 |
| చ. |
అనుటయు దేవదూతుఁడు రయంబున నిర్జరనాథు పాలికిన్ జని తెలియంగఁ జెప్పఁ గురుసత్తమ! ధర్మజు నిశ్చయంబు న య్యనఘచరిత్ర భాస్వరుని యాడిన మాటలు నాతఁ డంతయున్ విని చనుదెంచె నయ్యెడకు వేగమె సంయమి దేవయుక్తుఁడై. |
029 |
| ఆ. |
ధర్ముఁడును మహాముదంబున నిజపుత్త్రుఁ | డగు నజాతశత్రు ననునయించి రక్షణం బొనర్పఁ బ్రకటవాత్సల్యత | నరుగుదెంచెఁ గురుకులాగ్రగణ్య! |
030 |
| వ. | అప్పుడు. | 031 |
| సీ. |
వివిధ పాపాత్ములు వికృతశరీరు లై | యాతనా బాధితు లగుట మానె దుర్గంధమును గృధ్రవర్గాది పలలాశి | పక్షి పంక్తులుఁ గుణప వ్రజంబుఁ దోఁపన యెఱచి నెత్తురు కేశ పటలంబు | లస్థిపుంజము లదృశ్యంబు లయ్యెఁ; గ్రూరాసిపత్ర ఘోరారణ్యయుక్త వై | తరణి లేకుండె; సత్పరిమళంబు |
|
| తే. |
నింపుఁ జేయు సోఁకును సొగియించు తనుపు | నార వీతెంచి సమ్మోద మావహించె; నమృతమయ మిది యనఁదగి యనిల మధిక | విశదభావంబుఁ బ్రాపించె దిశలు పదియు. |
032 |
| వ. | ఆ సమయంబున వాసవుతోడఁ జనుదెంచినట్టి. | 033 |
| మహాసగ్ధర |
వసురుద్రాదిత్య గంధర్వ గరుడ భుజగ వ్రాతముల్ వైభవం బు ల్లసనం బొందంగ సిద్ధు ల్మనముల ముదము ల్పల్లవింపంగ సాధ్యుల్ హసితస్వాంతంబులం బె ల్లలమికొనఁగ నత్యాదరోత్కర్షముల్ పాం డుసుతో పాంతమ్ము నం బిండు గొని నిలిచి చూడ్కుల్ తదంగంబు గప్పన్. |
034 |
| వ. | ఒండొరులతో నక్కురుమూర్తి గుణవిశేషంబు లుగ్గడించి యగ్గించుచుండ సంయమి సుర సమేతంబుగా నయ్యాఖండలుండు నయ్యఖండ యశో మండితుం జేరంజని సాంత్వన స్వరంబున నిట్లనియె. | 035 |
| క. |
‘నీ విచ్చో నునికికి ని | ద్దేవతలందఱును వగచి ధిషణాగుణ సం భావిత! నిన్నుం దోడ్కొని | పో వచ్చినవారు కినుకఁ బో విడువ వనా. |
036 |
| క. |
సిద్ధియు నవ్యయలోక స | మృద్ధ సుఖావాప్తియును శమిత వికృతియు స ద్బుద్ధియు నుదాత్తభంగిని | సిద్ధించెను నీదుగుణ విశేషము కతనన్. |
037 |
| క. |
విను మొక్కటి సెప్పెద రా | జనువానికి నెల్లఁ దప్ప దవనీశ్వర! యె ట్లును నారక స్థలంబుం | గనుఁగొన వలయు టిది వేదకథితము సుమ్మీ! |
038 |
| సీ. |
పుణ్యంబులును బాపములు రెండు జోకలై | యుండుఁ బుణ్యంబుల నొదవు నాక సుఖము పాపంబులఁ జొప్పడు నరకదుః | ఖము విను మున్ను నాకంబు సుఖము ననుభవించిన యట్టి యతఁడు పదంపడి | యధిక నారక పీడ ననుభవించు; మున్ను నారక దుఃఖమునఁ బడ్డవాఁ డనం | తరమ నాకమునఁ దాఁ బొరయు సౌఖ్య; |
|
| తే. |
మల్పపుణ్యుండు తొలి తొలి యమరతా సు | ఖంబు గయికొని మఱియు దుఃఖముల నొందు; భూరిపుణ్యుండు మునుమును ఘోర నిరయ | యాతనల నొంది వెండి సౌఖ్యంబు లొందు. |
039 |
| క. |
ఇట నేను నిన్నుఁ బుత్తెం | చుట యుత్తరకాల దివ్య సుఖ సంగమ సం ఘటనకుఁ గాదే నీ కట | కటఁ బడుటకు దీనిఁ దెలుపఁగా రావలసెన్. |
040 |
| సీ. |
కర్ణుఁ డుత్తమసిద్ధిఁ గాంచి వెలింగెడు | నమ్మహాభుజునకు నై కరంబు దుఃఖింతు నీ వెప్డుఁ; దుది ముట్టి యున్నాఁ డి | తండు నిజోజ్జ్వలస్థాన మొంది సర్వాస్త్రవిదుని నా జలజాప్త నందనుఁ | గనుఁగొని చిత్తంబు కలఁక విడువు; మనిలనందనుఁడు నర్జునుఁడును నకులుండు | సహదేవుఁడును భవతై న్స్యరూప |
|
| తే. |
వర్తి సర్వమహీపతివర్గములును | ద్రౌపదియు ద్రౌపదేయులు రాజవర్య! దీప్త నిజధామ సంప్రాప్తిఁ దేజ మలరి | యుండఁగాఁ జూచి సమ్మోదయుతుఁడ వగుము. |
041 |
| ఆ. |
దైవ విహిత మగుటఁ దప్పింప రాకున్న | యట్టి యల్ప దుఃఖ; మనుభవించి తింక నిట సుఖంబు లేపార నాతోడ | విహరణం బొనర్పు విమలచరిత! |
042 |
| క. |
మానిత సువ్రతములకు | న్దానకరణమునకు ననుగుణం బయిన శుభం బే నీకుం గావింపం | గా నుజ్జ్వల వృత్తిఁ బరఁగు కౌరవముఖ్యా! |
043 |
| తే. |
రాజసూయాశ్వమేధాధ్వరముల సంచి | తంబు లయిన యుదాత్త లోకంబు లనుభ వింపు మాధిక్య మహనీయ విభవ మెసఁగ | నక్షయోదార సౌఖ్యంబు లావహిల్ల. |
044 |
| సీ. |
మహితవర్తనులైన మాంధాతృ నల హరి | శ్చంద్ర దిలీప దుష్యంత భరతు లొందిన కీర్తనీయోన్నతి నొందుము | నినుఁ గొనియాడంగ ముని నిలింప గంధర్వ గరుడోరగ ప్రధానులు సిద్ధ | సాధ్య సత్తములును సకుతుకముగ వచ్చినవా’ రని వారినెల్లనుఁ జూప | నతఁడు వినయ సంభృతాంగుఁ డగుచు |
|
| తే. |
నాదరముగఁ బ్రత్యుద్గతి యాచరింప | వార లెంతయుఁ బ్రీతిమై గారవంపుఁ బలుకు లెసఁగంగ నధిక సంభావనంబు | సేసి రాననములు విలసిల్లుచుండ. |
045 |
| వ. | అమ్మహేంద్రుఁ డమ్మహానుభావునితో మఱియు నిట్లనియె. | 046 |
| క. |
‘ఆకాశగంగ యిదె పు | ణ్యాకృతి; యిన్నదిఁ బరిప్లుతాంగుఁడ వై సు శ్లోకా! నాచెప్పిన నృప | లోకంబును మిగులు మమరలోకసుఖములన్.’ |
047 |