| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
అని పల్కి ధర్ముఁ డత్తనయునిఁ దోడ్కొని | యయ్యందఱును దోడ నరుగుదేర నాకాశ గంగ యుపాంతమునకుఁ బోవ | నప్పుణ్యనది నమ్మహానుభావుఁ డార్య సంస్తవన వాక్యంబులు చెలఁగ భ | వ్యస్నానమంగళ మాచరించి మానుష తనువు నమ్మాత్రన విడిచి ది | వ్యం బగు మహితదేహంబు దాల్చి |
|
| తే. |
వైరమత్సర స్నేహ సంవాసలౌల్య | గర్వశోకాదులైన హృద్గత వికార ములఁ దొఱంగి నిర్ధూమత్వమున వెలుంగు | పావకుఁడుఁబోలె శోభిల్లెఁ బౌరవేంద్ర! |
052 |
| వ. | ఇవ్విధంబున నొప్పి మీ తాత ధర్మనందనుండు బృందారక నాయక నారదాద్యుదార పురుషుల నభి నందించుచు ధర్ముండును దారును దో నరుగుదేర దివ్యశక్తి నటఁ జని మనోహరం బయిన యొక్కయెడ. | 053 |
| సీ. |
విస్ఫుర ద్బహురత్న వితతి కనత్కన | కాత్మకం బయిన మహాసనమున దేదీప్యమాన మై దివ్యావయవదీధి | తి ప్రతానం బెల్ల దిశల వెలుఁగఁ జక్రగదాద్యస్త్రసంతతి నుజ్జ్వలా | త్యంత సుందర పురుషాకృతులును జారుమౌళి స్థలీ సమవేత నిజరూప | ములుఁ గల్గి భక్తిమై బలసి కొలువఁ |
|
| తే. |
దనదు చూడ్కికి నెంతయుఁ దగు లొనర్చి | మున్ను చూచిన యట్లగుమూర్తి యొప్ప నరుఁడు కేవల సవినయ పరత వెలుఁగఁ | బొలుచు నారాయణునిఁ గాంచె భూపవర్య! |
054 |
| చ. |
కని మది నమ్మహాత్ముఁ డధిక ప్రమదంబు వహించె; నొండెడం గనుఁగొనియెం బ్రియం బెసఁగఁ గౌరవవంశవరేణ్య! దీప్తి ధా ముని రవిపంక్తిలోనఁ బదుమూఁడవ మూర్తి వెలుంగుచుండఁ గ ర్ణుని మఱి భీమసేనుని మరుద్గణ మధ్యగతత్వ శోభితున్. |
055 |
| తే. |
అంగముల భంగి తొల్లింటి యట్ల యై య | నూన తేజోవిరాజితు లైన వారిఁ గనియె నశ్విసమీపవర్తనులఁ దత్స | మానమూర్తుల వీక్షించె మాద్రిసుతుల. |
056 |
| చ. |
ఉదిత రవిచ్ఛవిం దరుణి నుత్పలగంధి నుదాత్తమూర్తి ద్రౌ పది నచొటెల్లనుం దన ప్రభన్ వెలుఁగొందఁగఁ జేయుదాని న వ్విదితయశుండు చూచి మది విస్మయమందఁగ నింద్రుతోడ ‘ని మ్మదవతి యెవ్వ? రార్యజనమాన్యచరిత్ర! యెఱుంగఁ జెప్పవే.’ |
057 |