పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
ఆశ్వాసాంతము
ఉ. పావన! దుర్దశాపహ! శుభప్రదమూర్తి! సుధానుభూతి సం
జీవిత భక్తలోక! తులసీదళదామ కపాలమాలికా
భావిభవాభిరామ! పరిపక్వతపఃఫలరూప! సాంఖ్య వి
ద్యావహ! యోగశక్తి విశదాద్భుత ఖేలన! లోకపాలనా!
095
క. దేవ! చతుర్విధ భూ | తావాసా! సుకృత హృదయ హారివిలాసా!
కేవల భావానందమ | యా! వేదవ్యాస వర్ణనారూఢ దయా!
096
మాలిని అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్త సారా!
సకల భువన రక్షాశాలి శుంభద్విహారా!
శుక జనకమనీషా శుద్ధ బుద్ధానుభావా!
సకృపకృత విలాసా! సంభృతానందభావా!
097
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందు స్వర్గారోహణపర్వంబు సర్వంబు నేకాశ్వాసము. 098
శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏకాశ్వాసమైన స్వర్గారోహణపర్వం సమాప్తం.
శ్రీమదాంధ్ర మహాభారతం సంపూర్ణం
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
శ్లో|| యదక్షర పదభ్రష్టం | మాత్రాహీనం చ యద్భవేత్‌,
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోఽస్తు తే.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )