పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. నిత్యానిత్యవివేక వైభవ సమున్నిద్రాంతరంగస్ఫుట
ప్రత్యక్షా! పరమేశ! విశ్వ జగదారాధ్యా! మహానంత చి
త్సత్యానంద విభు స్వభావ మహితా! సంవిత్సమాధాన దౌ
ర్గత్య వ్యాహృతి సంప్రవర్తన విదగ్ధ శ్రీ పదాంభోరుహా!
332
క. వ్యాసాది మునిప్రోక్త మ | హా సందర్భాప్రమేయతా రూఢ గుణో
ల్లాసా! నైర్గుణ్యసము | ద్భాసి రహస్యానుభావ! భక్తాధీనా!
333
మాలిని నమ దనిమిషచూడా నవ్యరత్న ప్రభా సం
గమ రుచిర పదాబ్జా! గర్వ దుర్వార దైత్యో
ద్యమ బహుల తమో మార్తాండ! దోః క్రీడన ప్ర
క్రమ లలిత వికాసా! గాఢ భక్తి ప్రకాశా!
334
గద్య. ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున నుద్యోగపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 335
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )