పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంతము
చ. కమల భవాది దైవత ముఖ స్ఫుట నిర్గళిత ప్రశస్త వా
గమృత రసప్రసార కలితాంచిత సేకవిధి ప్రకర్ష సం
గమ సముదీరితోల్లసన కందళిత ప్రహసద్దయాలతా
సుమహ దుపాశ్రయ ప్రమద శోభిత విశ్వజగన్మధువ్రతా!
426
క. సమయ బహుత్వారణ్య | భ్రమణ పరిశ్రామ్య దంతరంగ నితాంతో
త్తమ సరళమార్గ దర్శన | సమర్థ పుణ్యాభిధాన సకృదుచ్చరణా!
427
మాలిని అవగమిత రహస్యాష్టాంగ సమ్యక్ప్రకారో
త్సవ గురుకరుణా విస్తార గాఢ ప్రశాంతి
ప్రవణ హృదయ పద్మోద్భాసి విజ్ఞానసారా
వ్యవహిత పరమానందానుభూత్యేకరూపా!
428
గద్య. ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున నుద్యోగపర్వమునందు సర్వంబును జతుర్థాశ్వాసము. 429
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి యుద్యోగపర్వము సమాప్తము; ఆదిపంచకము సంపూర్ణము.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )