| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
పరమ కృపావిధేయ! నిరుపాధిక చిన్మయ కాయ ! గాఢ వి స్తరనిగమైకవేద్య! గుణతత్త్వ వికార నియత్యభేద్య ! సం స్మరణ నిరస్త తాప! ఘన సంసృతి సంతమస ప్రదీప! ని ష్ఠుర భుజసార దానవ నిషూదన! భక్తజన ప్రమోదనా! |
363 |
| క. |
చతురానందమయా | దు | ర్గతిరో గోద్గమ చికిత్సకా! భువన భవ స్థితి సంహారకరా! నిర్వృతి పణ్యాపణ పదారవిందవికాసా ! |
364 |
| మాలిని |
సురపతి ధృతచూడా శోభిరత్నాంశు వీచి స్ఫురణ సుభగపాదాంభోజ సంచారకేళీ పరిచయ కలనాలబ్ధవ్యయాతీత సౌఖ్యో త్తర మునిజన హృన్మా ద్యన్మరాళ ప్రతానా! |
365 |
| గద్య. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు ద్వితీయాశ్వాసము. | 366 |