| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అయోధ్య కాండము |
| ప్రభాత వర్ణనము | ||
| తే. |
పాకశాసని సేవంతి బంతి దివికి నెగుర వైచిన కైవడి నేమి చెప్పఁ బాండు వర్ణంబుతోఁ బూర్వ భాగ సీమ సొంపు మీఱఁగ వేగురుఁజుక్క వొడిచె. |
20 |
| వ. | అట్టి సమయంబున. | 21 |
| క. |
రవి యుదయించెను జనుఁడీ దివియలు, నక్షత్ర సమితి, తిమిరము, శశియున్ బవ లేమిటి? కను రీతిని గువలయమున గూళ్ళఁ గోళ్ళు గూయఁగ సాఁగెన్. |
22 |
| చ. |
వదలక పద్మరాగ మణి వజ్రపుఁ దర్మెనఁ బట్టి నేర్పు పెం పొదవఁగఁ దూర్పు కొండపయి కొప్పుగఁ దెచ్చి జగద్గురుండు దాఁ ద్రిదశవరేణ్యు కట్టెదురఁ దేఁకువ నిల్పిన దర్పణంబు నా నుదయము నొందె భానుఁడు సముజ్జ్వల కోకనద ప్రదీప్తులన్. |
23 |
| వ. |
ఆరాత్రి రాజశేఖరుని చిత్తంబు వచ్చునట్టుగా మెలంగి, యాతఁడు దన్ను మెచ్చు టెఱింగి, కైక యిట్లనియె: |
24 |