| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| దూతను జంపుట దోసమని రావణునకు విభీషణుని హితవు | ||
| క. |
దూతపనిఁ బూని వచ్చిన దూతలు తమ నోరి కెంత తోఁచిన నట్లా నేతల నాడుదు, రాడిన దూతలఁ జంపంగఁ దగదు దొరలకు నెందున్. |
213 |
| క. |
కాకుండిన మీ చిత్తము కాకెల్లను దీఱ ముజ్జగంబులు బెదరన్ ఢాక నడలించి తోకను, వీఁకన్ ముట్టించి పోవ విడుచుట చాలున్. |
214 |
| వ. | అని విన్నవించిన. | 215 |
| ఆ. |
నీతి వాక్య సరణి నెఱయంగ విని రావ ణాసురుండు కోప మెడలి పలికె వీనిఁ దోఁక గాల్చి, వెడలంగఁ ద్రోయుఁ డీ ప్రొద్దె యటకుఁ దిరిగి పోవుఁ గాక. |
216 |
| వ. |
అని యిట్లానతిచ్చిన విని, రాత్రించరు లతనిని సభా మధ్యంబు నుండి బయటికి వెడలం గొనిపోయి యొక్కచోట. |
217 |