| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| మారుతి పిడికిటిపోటుతో యమపురి కరిగిన లంకిణి | ||
| క. |
పోయెడు వాయుజు నెక్కడఁ బోయెదు నాచేత ననుచుఁ బోనీక వడిన్ డాయఁగ వచ్చిన లంకిణి కాయము వగులంగఁ బొడిచెఁ గడు వడిఁ గినుకన్. |
223 |
| వ. | ఇట్లు లంకిణిం జంపి, సువేలాచలం బెక్కి, సింహనాదంబు సేయుచు, | 224 |
| క. |
పుడమీ ధర శృంగంబున నడుగులు వడి నూఁది త్రొక్కి, యద్భుత శక్తిన్ జలరాశి దాఁటఁ బావని మిడివింటం బసిఁడి యుండ మీఁటిన రీతిన్. |
225 |
| వ. |
ఇట్లు కుప్పించి, యుప్పరం బెగసి, వాయు వేగంబునం జనుచు నయ్యబ్ధి మధ్యంబున నున్న సునాభం బను శైలంబునఁ దన దేహంబు దాహంబుఁ దీర్చుకొని, సముద్రంబును దాఁటి, యవ్వలి కిం జనియె నప్పుడు. |
226 |