| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| ఆశ్వాసాంత పద్య గద్యములు | ||
| క. |
జలజాక్ష! భక్త వత్సల! జలజాసన వినుత పాద జలజాత! సుధా జలరాశి భవ్య మందిర! జలజాకర చారు హంస! జానకి నాథా! |
249 |
| గద్యము | ||
| ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లబ్ధ గురుజంగమార్చన వినోద సూరిజన వినుత కవితాచమత్కా రాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీరామాయణ మహా కావ్యంబునందు సుందర కాండము సర్వము నేకాశ్వాసము. | ||