| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| వానరుల బీరమును వినిన రావణుని బెగడుపాటు | ||
| సీ. |
నాగపాశంబున నాఁ డాజిలోఁ బడ్డ-ప్లవగు లీరీతిని బ్రదుకు టెట్లు బ్రహ్మాస్త్రమునఁ గూల్పఁబడి ధాత్రి యెడఁబాసి-పోయినకపులెల్లఁ బుట్టు టెట్లు కుంభకర్ణుఁడు సావఁ గొట్టినవానరుల్-చెచ్చెఱ జీవించి వచ్చు టెట్లు అతికాయుఁ డడగించినట్టి కీశబలంబు-క్రమ్మఱఁ దానెల్ల గలుగు టెట్లు |
|
| తే. |
రాముఁ డెన్నంగ నాదినారాయణుండె-వనచరావళు లెల్ల దేవతల మున్నె కానలేనైతి నీరీతిఁ గదనమునను-వారిగెలువంగ నెవ్వారి వశము చెపుమ. |
101 |