| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| ఆశ్వాసాంత పద్య గద్యములు | ||
| క. |
జలజాక్ష! భక్త వత్సల! జలజాసన వినుత పాద జలజాత! సుధా జలరాశి భవ్య మందిర జలజాకర చారు హంస! జానకి నాథా! |
121 |
| గద్యము | ||
| ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహా కావ్యంబునందు యుద్ధకాండమునం బ్రథమాశ్వాసము. | ||