| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| పవనజుఁడు సుపార్శ్వుని మట్టుపెట్టుట | ||
| క. |
అంత సుపార్శ్వుఁడు మిక్కిలి పంతము నెఱపుచును రథము పవనాత్మజుపై నెంతయుఁ బఱపుచు బాణము లంతంతనె నాట నేయునవసరమందున్. |
15 |
| సీ. |
హనుమంతుఁ డాదైత్యునరదంబు పై దాఁటి-చెక్కలు వాఱంగఁ ద్రొక్కివేసి సైంధవంబులఁ జంపి సారథితలఁగొట్టి-గొడుగులు పడగలు పుడమిఁ గలిపి వడి వానిచే నున్న యడిదంబుఁ గైకొని-బిరుసుగా నేసిన ధరను గూలి గొబ్బునఁ దెప్పిర్లి కోపంబు దీపింప-ననిలజునురము మూఁడంబకముల |
|
| తే. |
జాంబవంతుని నిరుమూఁడు సాయకముల-వడి గవాక్షుని నైదింట వాలిసుతుని నేడు బాణంబులను దూలనేసె నంత-నవనిఁ బడి లేచి యంగదుం డాగ్రహమున. |
16 |
| తే. |
వాని చేవిల్లు విఱిచిన వాఁడు కినిసి పరిఘఁ గొని యేయ మూర్ఛిల్లి ధరణి వ్రాలి తెలిసి యంగదుఁ డాదైత్యుఁ దెగువ నురము పిడు గడంచినగతి ముష్టిఁ బొడిచి చంపె. |
17 |
| వ. | ఇట్లు సుపార్శ్వాది రక్షోనాయకు లాక్షణంబునం గూలిన. | 18 |