| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| దేవతలు చేసిన శ్రీరామ స్తోత్రము | ||
| క. |
మాకొఱకు జనన మొందితి రాకాసులరాజుఁ జంపి రక్షించితి వౌ లోకంబు లెల్లఁ గృపతో సాకేతపురాధినాథ! సజ్జనవినుతా! |
121 |
| క. |
అని వినుతి సేసి కలనన్ జనిపోయినకపుల నెల్ల సత్కృప బ్రదుకుం డని వరము లిచ్చి యరిగిరి ఘను లాదేవతలు మరలి గగనంబునకున్. |
122 |
| వ. | తదనంతరంబున. | 123 |
| తే. |
భానుపుత్త్రాది వానరబలముతోడ ఘనవిభీషణముఖ్యరాక్షసులతోడ మఱియు జానకితోడ లక్ష్మణునితోడఁ బుష్పకంబెక్కి చనియె నాభూమివిభుఁడు. |
124 |