| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| శ్రీరాముని ధర్మ పరిపాలనము | ||
| సీ. |
సకలౌషధక్రియాసంజీవకరణిచేఁ-జెలఁగి దిక్కులను రక్షింపఁజాలు బంధురోన్నతశస్త్రసంధానకరణిచేఁ-గుటిలారులను రంభ గూర్పఁ జాలు సంతతోత్పాదనసౌవర్ణ కరణిచే-నర్థులదారిద్ర్యమడఁపఁజాలు ననుదిన సంధాన మనుశల్యకరణిచేఁ-బురుషార్థనికరంబుఁ బ్రోవఁజాలు |
|
| తే. |
సిద్ధివిద్యానురాగప్రసిద్ధుఁడైన-రాజచంద్రుఁ డితండని రాజు లెల్ల సన్నుతింపఁగ విలసిల్లె జగతియందు-భాగ్యవిస్తారి రామభూపాలశౌరి. |
134 |
| సీ. |
కుటిలత నదులందుఁ గుంతలంబులయందు-బొంకు జూదములందు బూతులందు లేమి వైరులయందు లేమలనడుమందు-భంగ మంబుధులందుఁ బరులయందుఁ గోపంబు ఖలులందుఁ గ్రూరవర్తనులందు-వడఁకు వీణలయందు వ్యసనులందు బంధంబు రతులందుఁ బటుశిరోజములందు-మోహంబు ధనమందు ముదితలందు |
|
| తే. |
జింత కవులందుఁ దపసులచిత్తమందు-వర్ణమిళితంబు చిత్తరువందు యవను లందుననె కాని యెండెడఁ జెందకుండ-లీల ధర యేలె రామభూపాలవరుఁడు. |
135 |