| కీర్తనలు | శ్యామా శాస్త్రి | ఓ జగదంబ నను అంబ నీవు జవమున బ్రోవు అంబ |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| ఓ జగదంబ నను అంబ నీవు జవమున బ్రోవు అంబ॥ |
| అను పల్లవి: |
| ఈ జగతి గతియై జనులకు మరి తేజమున రాజవినుతయౌ రాజముఖి సరోజనయన సుగుణ రాజరాజిత కామాక్షి॥ |
| చరణము(లు): |
| కన్నతల్లి నాదు చెంతనెంత కన్నడ సలుపగ తగునా నిన్ను నే నమ్మియున్నవాడగదా నన్నొకని బ్రోచుటకరుదా? అన్ని భువనంబుల గాచేవు ప్రసన్నమూర్తి అన్నపూర్ణ వరదా విన్నపంబు విన్నవించి సన్నిధి విపన్న భయ విమోచన ధౌరేయ॥ |
| జాలమేల శైలబాల తాళ జాలను జననీ నిన్నువినా పాలనార్థముగ వేరే దైవముల లోలమతియై నమ్మితినా? నీలనుతా శీలమునెచ్చటనైన గాన గానలోల హృదయా నీలకంఠరాణి నిన్నునమ్మితిని నిజంబుగ బలికేది దయచేసి॥ |
| చంచలాత్ముడేను యేమిపూర్వ సంచితముల సలిపితినో? కంచికామాక్షి నేను నిన్ను పొడ గాంచితిని శరణు శరణు నీ వించుకా చంచలగతి నా దెస నుంచవమ్మా శ్యామకృష్ణ వినుతా మంచి కీర్తినిచ్చునట్టి దేవి మన్నించి నాదపరాధముల సహించి॥ |
| స్వరము(లు): |
| వరసితగిరి నిలయుని ప్రియ ప్రణయిని పరాశక్తి మనవిని వినుమా మరియాదలెఱుగని దుష్ప్రభుల కోరి వినుతింపగ వరంబొసగు॥ |