| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే |
| పున్నాగవరాళి - ఆది |
| పల్లవి: |
| కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే॥ |
| అను పల్లవి: |
| వనజభవహరినుతే దేవి తుహినగిరిజే లలితే సతతం వినతం మాం పరిపాలయ శంకర వనితే సతి మహాత్రిపుర సుందరి॥ |
| చరణము(లు): |
| కంబుకంఠి కంజసదృశ వదనే కరిరాజగమనే మణిసదనే శంబరవిదారి తోషిణి శివశంకరి సదా మధుర భాషిణి॥ |
| చండ ముండఖండనపండితేక్షుదండ కోదండమండితపాణి పుండరీక నయనార్చితపదే త్రిపురవాసిని శివే హర విలాసిని॥ |
| శ్యామళాంబికే భవాబ్ధి తరణే శ్యామకృష్ణపరిపాలిని జనని కామితార్థఫలదాయికే కామాక్షి సకలలోకసాక్షి॥ |