| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కరుణజూడవమ్మా వినమ్మా |
| వరాళి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| కరుణజూడవమ్మా వినమ్మా శ్రితజనకల్పవల్లీ మాతల్లీ॥ |
| అను పల్లవి: |
| మరకతాంగి పంచనదేశురాణి మధురవాణి ధర్మసంవర్ధని॥ |
| చరణము(లు): |
| నరాధములను మహారాజులని పొగడి దురాశచే తిరిగి వేసారి ఇలలో విరాజముఖి నీవు దయతో కాపాడి బిరాన వరమీయవే గిరిరాజసుతా నీవు॥ |
| ఉమా భువిని నీకు సమానమెవరు? భారమా రక్షించుటకు అభిమానములేదని కుమారుడుగదా నాకిపుడు అభయమీయవే కుమారజనని నీవు మానవాతీత గదా॥ |
| ఉదారగుణవతిగదా సామగాననుతా సదా నుతిజేరి నీ పదాంబుజముల ను దాసుని మొఱ వినవా సమయమిదే సదాశివుని రమణీ దీనజనాశ్రితే॥ |
| ఉదారముగను అవతారమెత్తి జగమును సుధాకరునివలె రంజింపజేయు నీ పదాంబుజమును నమ్మి నిన్నే భజించి సదా శ్యామకృష్ణ జేసిన భాగ్యమే॥ |