| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కరుణజూడు నిన్నునమ్మిన వాడగదా |
| శ్రీ - మిశ్ర చాపు |
| పల్లవి: |
| కరుణజూడు నిన్నునమ్మిన వాడగదా ఇంత పరాకేలనమ్మా॥ |
| అను పల్లవి: |
| సరసిజాసన మాధవ సన్నుత చరణా బృహన్నాయకి వేగమే॥ |
| చరణము(లు): |
| దీనజనావన మూర్తివి నీవని నేను నిన్ను నెఱనమ్మితిని గానవినోదిని ఘననిభవేణి కామితఫలదా సమయమిదే॥ |
| నీమహిమాతిశయంబుల నెంతని నే జెప్పుదునో లలితా హేమాపాంగీ హిమగిరిపుత్రీ మహేశ్వరి గిరీశ రమణి నీ॥ |
| శ్యామకృష్ణ పరిపాలిని శూలిని సామజగమనా కుందరదనా తామసంబిటు సేయక నా పరితాపములను పరిహరించిన నీవు॥ |