| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కరుణానిధి ఇలలో నీవనుచును |
| తోడి - ఆది, తిశ్ర గతి |
| పల్లవి: |
| కరుణానిధి ఇలలో నీవనుచును కన్నతల్లీ వేడుకొంటిని నీ శరణంటిని॥ |
| అను పల్లవి: |
| అరుణాంబుద నిభచరణా సురముని శరణానంతేష్టదాయకి శ్రీ బృహన్నాయకి॥ |
| చరణము(లు): |
| గానవినోదిని నీమహిమాతిశయంబుల ఎంతటివాడను తరమా బ్రోవ తామసమిటు జేసితే అరనిమిషమైన తాళజాలనమ్మా మాయమ్మా నేడు నీ బాలుడను గాన॥ |
| పామరపాలిని పావని నీవు గదా నీ పాదమే గతియని నమ్మినాను కోమల మృదు భాషిణీ ఘనసదృశవేణీ శ్యామకృష్ణసోదరి గోకర్ణేశ్వరుని రాణి॥ |