| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కామాక్షి నీ పదయుగము (స్వరజతి) |
| యదుకులకాంభోజి - త్రిపుట ( - మిశ్ర చాపు) |
| పల్లవి: |
| కామాక్షి నీ పదయుగము స్థిరమని నే నమ్మియున్నాను నా చింతలెల్లను దీర్చమ్మ॥ |
| స్వరము(లు): |
| అంబ నను బ్రోవ సమయము వినుమా పతితపావనిగ॥ |
| అనుదినము శరణమని నిన్ను వేడుకొనియున్న సుతుడమ్మ సదయ॥ |
| సరసిజాసన హరీశవినుతపాదా నాతో వాదా? |
| కమలదళసమనయన కచజితఘనా శశిధర నిభవదన॥ |
| మానవతి నిను సదా దలచిన మానవులకెల్ల ఫలమొసగే బిరుదుగల దేవతయని నే వినబడి నీవే గతియనుచు॥ |
| పావని పురహరుని రమణీ పార్వతి సకల జనని పాతకములను వడిగా దీర్చి వరమొసగుము॥ |
| కనకగిరి సదన నిను గొలిచిన జనములకు దినదినము శుభమొసగే వని శృతులు మొఱలిడగా మొఱలు విని విని విని॥ |
| బాలకిసలయ చరణ నిమిషము తాళనిక విని మదగజగమన తామసము సేయకనే నన్నిపుడు బ్రోవుము పరాత్పరి॥ |
| కుందముకుళరదా సురబృందవినుతపదా భువిలో వరదాయకిగదా నా మొఱలు చెవులకు వినదా గిరిసుత॥ |
| నీవలెనే గలదా నెఱదాతవు ఈ జగతిలో నీదు పదసారసముల ఈ భవజలధికి తరియనుచు మిగుల॥ |
| కమలసంభవ సురమునీంద్రుల చేతను నిను పొగడుటకు తరమమ్మ శుభమిమ్మ నినునమ్మితిని శ్యామకృష్ణసోదరి దురముగను కరుణ సలుపుమికను॥ |