| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే |
| వరాళి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే॥ |
| అను పల్లవి: |
| తామసమేల రావే సామగానలోలే సుశీలే॥ |
| చరణము(లు): |
| కామకాల ప్రియభామినీ కామ్య కామదే కల్యాణీ కామాక్షీ కంజదళాయతాక్షీ త్రికోణవాసినీ కారుణ్యరూపిణి॥ |
| పావనీ మృదుభాషిణీ భక్తపాలినీ భవమోచనీ హేమాంగీ హిమగిరిపుత్రీ మహేశ్వరీ హ్రీంకార రూపిణీ॥ |
| శ్యామకృష్ణపరిపాలినీ శుకశ్యామళే శివశంకరీ శూలినీ సదాశివునికి రాణీ విశాలాక్షతరుణీ శాశ్వతరూపిణీ॥ |
| స్వరము(లు): |
| నా మనవిని విను దేవీ నీవే గతియని నమ్మినాను మాయమ్మా వేగమే కరుణ జూడవమ్మా బంగారుబొమ్మా॥ |