| కీర్తనలు | శ్యామా శాస్త్రి | జనని నతజనపరిపాలిని పాహిమాం భవాని త్రిలోక |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| జనని నతజనపరిపాలిని పాహిమాం భవాని త్రిలోక॥ |
| అను పల్లవి: |
| దనుజవైరినుతే సకలజన పరితాప పాపహారిణి జయశాలిని॥ |
| చరణము(లు): |
| సతతవినుత సుతగణపతి సేనాని రాజరాజేశ్వరి విశాలాక్షతరుణి అఖిలజనపావని శ్రీ రాజరాజేశ్వరి సతి శుభచరితే సదా మధుర భాషా విగళదమృతరసధ్వని సురనుత పదయుగ దర్శిత ఇహ మమ గాత్రమతిమాత్రమజని సుజని॥ |
| కువలయ లోచనయుగళే కల్యాణి నీలవేణి వికచకోకనద రజచ్చరణే అతిరమణి ఘననీలవేణి భువి దివి రక్షణి దృతామరగణే భాగ్యవతి శక్తిసంపూర్ణే కవన నిపుణమతిం అయి దిశ ఇహ తవ కాంతిముపయాతుం గిరీశ రమణి॥ |
| చరణనిపతదమరసముదయే కాళి సారసముఖి సుశోభితోరుయుగళ వరకదళినవ సారసముఖి సురుచిర మురళీ మృదంగస్వరసంశోభిని రసకృత మహీతలే సరసిజకరయుగళే కటికలిత మణి కాంచీభృతే కాంచీపురవాసిని॥ |