| కీర్తనలు | శ్యామా శాస్త్రి | తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే |
| కల్యాణి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే॥ |
| అను పల్లవి: |
| ఎల్లలోకముల కాధారమైయున్న నా॥ |
| చరణము(లు): |
| ఆదిశక్తి నీవు పరాకుసేయకు ఆదరించుటకిది మంచిసమయము గదా సరోజభవాచ్యుత శంభునుతపదా నీదు దాసానుదాసుడౌ నా॥ |
| దేవి నీదు సరిసమానమెవరని దేవరాజమునులు నిన్ను పొగడగ నా వెద దీర్చి బిరాన వరాలొసగి నన్నుబ్రోవ నీ జాలమేలనే॥ |
| శ్యామకృష్ణ పరిపాలినీ జననీ కామితార్థప్రదా పంకజలోచని కౌమారీ రాణీ పురాణీ పరాశక్తి కామకోటి పీఠవాసినీ॥ |