| కీర్తనలు | శ్యామా శాస్త్రి | త్రిలోకమాతా నన్నుబ్రోవు కరుణను |
| పరజు - మిశ్ర చాపు/ఆది |
| పల్లవి: |
| త్రిలోకమాతా నన్నుబ్రోవు కరుణను దినదినమికను బ్రోవుము అంబా॥ |
| అను పల్లవి: |
| విలోకింపుము సదయ నన్ను చల్లని వీక్షించి క్షణమున కామాక్షి॥ |
| చరణము(లు): |
| నిన్ను నమ్మియుండగ శ్రమపడవలెనా నేనెందు గాన దిక్కు నిన్నువినా ఘనముగా కోరికల కోరి కోరియేమి గానగ ఖిన్నుడనైతి ధన్యుజేసి॥ |
| జపములెఱుగను తపములెఱుగను చపలచిత్తుడను సతతము కృపకు పాత్రుడను వేడెదను నిను కీర్తించి యెట్లైన నీ బిడ్డయని॥ |
| మరువక నిను నే మది దలచగను మన్నించి వెరవకు మనరాదా? శరణనే సుజనుల పాలి కల్పవల్లి శంకరీ శ్యామకృష్ణసోదరీ॥ |