| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దేవి మీన నేత్రి బ్రోవ రావే |
| శంకరాభరణం - ఆది |
| పల్లవి: |
| దేవి మీన నేత్రి బ్రోవ రావే దయచేయవే బ్రోవరావమ్మా॥ |
| అను పల్లవి: |
| సేవించేవారికెల్లను చింతామణియై యున్న॥ |
| చరణము(లు): |
| బాల నీవే గతియని నిన్నే చాలా నమ్మిన నాపై పరా కేలా దయచేయ నీకిది మేలా దివ్యాంబా కాలాది విరాణీ సద్గుణశీలా కీరవాణీ దేవీ నీల నీరదవేణి త్రిలోక జననీ దేవీ మహేశ్వరీ భవానీ॥ |
| అంబా ముఖనిర్జిత శతధరబింబా రక్షితదేవదాత వమ్మా నత నిజసుత గుహ హేరంబాంబా శ్యామళాంబా బింబాధరి గౌరి కాదంబ విహారి అంబ కంబుకంఠి హిమశైల వృక్ష పాలికా దేవి బాలాంబికా అంబా॥ |
| వాణీ రమా వందిత రుద్రాణీ నీసాటెవరు క ల్యాణి శ్యామకృష్ణనుతా కీరవాణీ శర్వాణీ వీణావినోదిని శ్రీ చక్రకోణ నివాసిని గీ ర్వాణ వందిత పదారవిందా శివా దేవీ కాత్యాయని॥ |