| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా |
| కల్యాణి - ఝంప |
| పల్లవి: |
| దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా॥ |
| అను పల్లవి: |
| సేవించి నిన్నే సదా నమ్మితిని నిరతముగ నమ్మితిని॥ |
| చరణము(లు): |
| అనాథరక్షకి బిరానబ్రోవుము తల్లి ఆశ్రితజనపాలిని భవాని దేవి త్రిలోకజనని॥ |
| పరాకుసేయక వరాలొసగుము తల్లి పామరజనపాలిని మృడాని దేవి త్రిలోకపాలిని॥ |
| కుమారజనని కటాక్ష సేయుము తల్లి శ్యామకృష్ణపాలిని పురాణి దేవి బృహదంబా॥ |