| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే |
| జనరంజని - త్రిపుట |
| పల్లవి: |
| నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే॥ |
| అను పల్లవి: |
| కన్నతల్లి నీవే అంబా నా మొఱలను వినరాదా॥ |
| చరణము(లు): |
| ఆదిశక్తి మహేశ్వరీ కౌమారీ ఆదరింపవే వే వేగమే నీలాయతాక్షీ భవానీ॥ |
| కోమలమృదువాణీ కల్యాణీ సోమశేఖరుని రాణీ లలితాంబికే వరదే॥ |
| శ్యామకృష్ణసహోదరీ ఓంకారీ శాంభవీ ఓ జననీ నాదరూపిణీ నళినాక్షీ॥ |