| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నన్ను బ్రోవు లలితా వేగమే చాల |
| లలిత - మిశ్ర చాపు |
| పల్లవి: |
| నన్ను బ్రోవు లలితా వేగమే చాల నిన్ను నెఱ నమ్మియున్న వాడగదా భక్త కల్పకలతా॥ |
| అను పల్లవి: |
| నినువినా ఎవరున్నారు గతి జననీ అతి వేగమే వచ్చి॥ |
| చరణము(లు): |
| పరాకు సేయకనేవచ్చి కృపసలుప రాదా మొఱ వినవా పరాశక్తి గీర్వాణ వందితపాద నీ భక్తుడనమ్మా సంతతము॥ |
| సరోజభవ కమలనాథ శంకరసురేంద్ర నుతచరితా పురాణి వాణీ ఇంద్రాణీ వందిత రాణి అహిభూషణుని రాణీ॥ |
| మదాత్ములైన దురాత్మజనులను కథలను పొగడి సదా నే వరాల చుట్టి తిరిగితి వెతలనెల్ల దీర్చివరమొసగి॥ |
| సుమేరు మధ్య నిలయే శ్యామకృష్ణుని సోదరి కౌమారి ఉమా శ్రీ మీనాక్షమ్మా శంకరీ ఓ మహారాజ్ఞీ రక్షించుట కిది సమయము॥ |