| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నిన్ను వినా మఱిగలదా గతి లోకములో |
| ఆభేరి - రూపక (రీతిగౌళ -) |
| పల్లవి: |
| నిన్ను వినా మఱిగలదా గతి లోకములో నిరంజని నిఖిలజనని మృడాని భవాని అంబ॥ |
| అను పల్లవి: |
| పన్నగభూషణుని రాణి పార్వతి జనని అంబ పరాకు సేయక రాదు విను శ్రీ బృహదంబ వినుము॥ |
| చరణము(లు): |
| పామరునమ్మా దయచేసి వరమీయమ్మా మాయమ్మా పాపమెల్ల పరిహరించి బిరాన బ్రోచుటకు॥ |
| సారములేని భవ జలధి తగులు కొని చాల వేసారితిని నా విచారము దీర్చుటకు॥ |
| నా మదిలో అంబ నీవే గతియని నమ్మితి శ్యామకృష్ణనుతా భక్తపరిపాలనము సేయుటకు॥ |