| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నిన్నే నమ్మినాను సదా నా |
| తోడి - త్రిపుట ( - మిశ్ర చాపు) |
| పల్లవి: |
| నిన్నే నమ్మినాను సదా నా విన్నపము విని నన్ను బ్రోవుము॥ |
| అను పల్లవి: |
| కన్నతల్లి గదా బిడ్డయని కనికరమింతైన లేదా పన్నగధరుని రాణి శుకపాణి కామాక్షి కల్యాణి॥ |
| చరణము(లు): |
| వేగమె వచ్చి నాదు కోర్కెలీవే పరాముఖమేల భోగీంద్రసన్నుత పూతచరితా పురుహూతపూజితా పరదేవతే॥ |
| ధ్యానమే వినగ మంత్ర తంత్రమేమిలెరుగనే గానవినోదినీ నీదు సాటి జగాన గాననే బంగారు బొమ్మా॥ |
| శ్యామకృష్ణ సహోదరీ భక్త కామితార్థ ఫలదాయకీ కామాక్షీ కంజదళాయతాక్షి కారుణ్యమూర్తి గదా నీవే సంపద॥ |
| స్వరము(లు): |
| నీ మహిమవిని మదిలో నీవే గతియనుచును కోరితి కమలభవ దనుజరిపునుత పదకమలయుగ సమయమిదే బ్రోవుము॥ |