| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి |
| పరజు - త్రిపుట (మాయామాళవగౌళ - ) |
| పల్లవి: |
| నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి॥ |
| అను పల్లవి: |
| ఫాలాక్షుని రాణీ పాలితాశ్రిత శ్రేణి॥ |
| చరణము(లు): |
| దీనరక్షకీ అభయదానమీయవే సామ గానలోలే అభిమానమీయవే దేవీ॥ |
| ఆదిశక్తి కౌమారీ మేదినిలో నిన్ను పొగడ ఆదిశేషునికైన రాదిక నేమి జెప్పుదు దేవి॥ |
| కామపాలిని విను నీ నామములే ధర్మార్థ కామమోక్షమిచ్చేది శ్యామకృష్ణపాలినీ దేవీ॥ |